English | Telugu

ప‌వ‌న్‌ని అడ్డుకొనే స‌త్తా ఉందా?

ప‌వ‌ర్ స్టార్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు... ఇమేజ్‌ ఓ ఫీవ‌ర్‌లా పాకుతోంది. ప‌వ‌న్ ఇమేజ్, అత‌ని స్టార్ డ‌మ్‌ ఆకాశాన్ని అంటుతున్న రోజులివి. అత్తారింటికి దారేది సినిమా సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేశాక‌, ఇండ్ర‌స్ట్రీ రికార్డుల దుమ్ము దులిపాక‌.. అత‌ని సినిమాతో పోటీ ప‌డ‌డం అంటే.. కొండ‌ను ఢీ కొట్ట‌న్న‌ట్టే అనే నిర్ణ‌యానికి వ‌చ్చేశారు నిర్మాత‌లు. అందుకే ప‌వ‌న్ సినిమాకి ముందూ, వెనుక త‌మ సినిమాని విడుద‌ల చేయ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. అయితే ఈ సంక్రాంతికి మాత్రం బాక్సాఫీసు ద‌గ్గ‌ర ర‌స‌వ‌త్త‌ర‌మైన పోటీ జ‌ర‌గ‌బోతోంది. ప‌వ‌న్‌కి రెండు సినిమాలు పోటీ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌య్యాయి. ఎన్టీఆర్‌, శంక‌ర్ సినిమాలు ఈసారి ప‌వ‌న్‌తో ఢీ కొట్ట‌బోతున్నాయి.


ఎన్టీఆర్ - పూరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం టెంప‌ర్‌. ఈ సినిమాని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సంక్రాంతికే విడుద‌ల చేయాల‌ని కొబ్బ‌రికాయ్ కొట్టే ముందే డిసైడ్ అయ్యారు. ఈ సినిమాకి సంక్రాంతికి రావ‌ట్లేద‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నా... చిత్ర‌బృందం మాత్రం సంక్రాంతి బ‌రిలో మేం ఉన్నాం.. అని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతోంది. వ‌రుస ఫ్లాపుల‌తో ఎన్టీఆర్ ఇమేజ్ డేంజ‌ర్ జోన్‌లో ప‌డింది. రామ‌య్యా వ‌స్తావ‌య్యా, ర‌భ‌స సినిమాలు అటు బాక్సాఫీసునీ, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని సైతం మెప్పించ‌లేక‌పోయాయి. దానికి తోడు పూరి జ‌గ‌న్నాథ్‌ని ఎవ్వ‌రూ గుడ్డిగా న‌మ్మే పరిస్థితి లేదు. పూరి సినిమా అన‌గానే ఎప్పుడు ఎలాంటి సినిమా తీస్తాడో అనే క‌న్‌ఫ్యూజ‌న్ ఎలాగూ ఉంటుంది. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఆంధ్రావాలా కూడా ఫ్యాన్స్‌ని క‌ల‌వ‌ర పెడుతోంది. అయితే ఎన్టీఆర్‌, పూరి ఇద్ద‌రికీ సంచ‌ల‌నాలు సృష్టించే స‌త్తా ఉంది. ఆ ధైర్యంతోనూ ఇద్ద‌రూ క‌ల‌సి క‌ట్టుగా, క‌సిగా ఈ సినిమా కోసం ప‌నిచేస్తున్నార‌ట‌. సినిమాపై పూర్తి న‌మ్మ‌కం కుదిరాకే... సంక్రాంతికి బ‌రిలో దింపాల‌ని చిత్ర బృందం ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింద‌ట‌.



శంక‌ర్ - విక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకొంటున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఐ కూడా ఈ సంక్రాంతి బ‌రిలో నిలిచింది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. దేశ‌మంతా శంక‌ర్ ఎలాంటి అద్భుతం సృష్టిస్తాడా?? అనే ఆస‌క్తి నెల‌కొంది. దాదాపు రూ.120 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం.. సంక్రాంతికి గ‌ట్టి పోటీ ఇస్తుంద‌నే విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. శంక‌ర్ సినిమా అంటే... తెలుగునాట కూడా విప‌రీత‌మైన క్రేజ్‌. ప్ర‌చార చిత్రాలు, అందులోని విక్ర‌మ్ గెట‌ప్స్ ఇప్ప‌టికే హ‌ల్ చ‌ల్ సృష్టిస్తున్నాయి. ఈ సంక్రాంతికి ప‌వ‌న్ సినిమాకి పోటీ ఇచ్చే స‌త్తా శంక‌ర్ సినిమాకే ఉంద‌నేది అంద‌రూ ఒప్పుకుని తీర‌తారు. అయితే ప‌వ‌న్ మానియానా, శంక‌ర్ సంచ‌ల‌న‌మా?? అనేది నిర్ణ‌యించేది మాత్రం ప్రేక్ష‌కులే. ఓ మైగాడ్ ఆల్రెడీ బాలీవుడ్‌లో హిట్ట‌య్యింది. తెలుగు వాతావ‌ర‌ణానికి త‌గిన‌ట్టుగా తీస్తే, అందులో ప‌వ‌న్ ఇమేజ్‌ని స‌రిగ్గా క్యారీ చేస్తే.. గోపాల గోపాల త‌ప్ప‌కుండా సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయం. ఇప్ప‌టికే ఈ సినిమాకి అన్ని ఏరియాల నుంచీ.. ఫ్యాన్సీ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. అత్తారింటి దారేది త‌ర‌వాత వ‌స్తున్న సినిమా ఆ క్రేజ్ గోపాల గోపాల‌కు ప్ల‌స్ అవుతుంది. శంక‌ర్ సినిమా ఏమాత్రం తేడాగా ఉన్నా ఈ సంక్రాంతి విజేత ప‌వ‌న్ కావ‌చ్చు. అయితే మ‌ధ్య‌లో ఎన్టీఆర్‌నీ మ‌ర్చిపోకూడ‌దు. ఎన్టీఆర్ అస‌లే క‌సిమీద ఉన్నాడు. హిట్ కొట్టి... త‌న ప్ర‌తాపం చూపించినా చూపించొచ్చు. మొత్తానికి ఈ సంక్రాంతికి ముక్కోణ పోటీ ఖాయం. అయితే... అవ‌కాశాలు ప‌వ‌న్ వైపే మొగ్గు చూపిస్తున్నాయి. మ‌రి ప‌వ‌న్‌ని అడ్డుకొనేదెవ‌రో, బాక్సాఫీసు విజేత ఎవ‌రో.. కాల‌మే చెప్పాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.