English | Telugu

ఫ్యామిలీతో విహారయాత్రలో పవన్ కళ్యాణ్..!

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఫలితాన్ని పక్కన పెడితే, ఆ సినిమా కోసం విపరీతంగా కష్టపడ్డాడు పవన్. మండే ఎండల్లో, డే అండ్ నైట్ ఖాళీ లేకుండా షూట్ చేసి సినిమాను కంప్లీట్ చేశారు మూవీ టీం. సినిమా రిలీజైన తర్వాత ఫలితం నిరాశ మిగిల్చినా, వెంటనే తన తర్వాతి సినిమాపై దృష్టి పెట్టిన పవన్, ఆ సినిమా ముహూర్తం చేసేసి ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుతున్నాడు. హాట్ సమ్మర్ నుంచి కాస్త రిలీఫ్ అవసరమనిపించిందేమో..కుటుంబంతో కలిసి ఫారిన్ విహారయాత్రకు వెళ్లాడు పవర్ స్టార్. బహుశా తన భార్య మాతృభూమి రష్యాకు పవన్ వెళ్లి ఉంటారని సినీజనాలు అనుకుంటున్నారు. సూర్య సినిమా మొదలైన తర్వాత, మరో ఏడాది వరకూ పవన్ డైరీలో ఖాళీ ఉండకపోవచ్చు. అందుకే ఈ బ్రేక్ చాలా అవసరమని పవన్ భావించాడట. టూర్ నుంచి తిరిగిరాగానే, ఎస్ జే సూర్య సినిమాకు క్యాస్టింగ్ తో పాటు, షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం మూవీ ప్రీప్రొడక్షన్ పనుల్లో సూర్య కూడా బిజీగా ఉన్నాడు. అనూప్ రూబెన్స్ ఇప్పటికే రెండు పాటలకు సంగీతాన్ని అందించాడు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లో శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.