English | Telugu

పవన్ తీన్ మార్ పబ్లిసిటీకి వస్తాడా...!

పవన్ కళ్యాణ్ "తీన్ మార్" మూవీ పబ్లిసిటీకి వస్తాడా అన్నది ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. మామూలుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తను హీరోగా నటించే ఏ సినిమా పబ్లిసిటీ లోనూ తాను పాల్గొనడనే సంగతి మన తెలుగు సినీ పరిశ్రమలో అందరికీ తెలిసిందే. అయితే ఈ "తీన్ మార్" మూవీ పబ్లిసిటీకి ఈ చిత్రంలో నటించిన మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులూ వస్తున్నారు. హీరో పవన్ కళ్యాణ్ మాత్రం "తీన్ మార్" మూవీ పబ్లిసిటీకి రావటం లేదు.


ఒక వేళ పవన్ కళ్యాణ్ కి వచ్చే ఉద్దేశమున్నా రావటానికి ఏ మాత్రం అవకాశం లేదు. ప్రస్తుతం" గబ్బర్ సింగ్", "ది షాడో" చిత్రాలతో పవన్ కళ్యాణ్ యమ బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ని "తీన్ మార్" చిత్రం పబ్లిసిటీకి రమ్మని పిలవటానికి బహుశా "తీన్ మార్" చిత్ర నిర్మాత గణేష్ కూడా ధైర్యం చెయ్యడేమో.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.