English | Telugu
సూపర్ ఫాస్ట్ ' సర్దార్ గబ్బర్ సింగ్ '
Updated : Feb 21, 2016
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత క్రేజీయస్ట్ ప్రాజెక్ట్స్ లో ఒకటి. కేవలం లుంగీలో నడిచి వస్తున్నట్లు రిలీజ్ చేసిన సర్దార్ టీజర్ కు వచ్చిన ఆదరణ బట్టే చెప్పచ్చు, ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో..ఈ క్రేజ్ కారణంగానే, సర్దార్ కు రికార్డ్ బ్రేకింగ్ బిజినెస్ జరిగింది. సినిమా మీదున్న అంచనాలను అందుకునేలాగే సినిమా ముస్తాబవుతోందని చెబుతున్న సినిమా టీం ఏప్రిల్ 8 న ఎట్టి పరిస్థితుల్లోనూ మూవీ రిలీజయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటోంది.
తాజాగా, ఫిల్మ్ సిటీలో వేసిన సెట్లో, సర్దార్ ఫైటింగ్ సీక్వెన్సెస్ తీస్తున్నారు. ఈ ఫైట్స్ కు రామ్ లక్ష్మణ్ లు కొరియోగ్రఫీ చేస్తున్నారు. మార్చి మొదటివారానికి టాకీ పూర్తి చేసుకుని పాటలకు ఫారిన్ వెళ్లబోతోంది సర్దార్ యూనిట్. ఈ సినిమాతో కాజల్ మొదటిసారి పవన్ తో జతకట్టనుండటం విశేషం.