English | Telugu

అంతా ప‌వ‌న్ క‌ల్యాణే చేస్తున్నాడు

ప‌వ‌న్ ఓ సైలెంట్ సునామీ. ప‌బ్లిసిటీలు. ఫ‌లితాలు ప‌ట్టించుకోడు. తాను చేయాలనుకొన్న‌వి సైలెంట్‌గా చేసుకొంటూ వెళ్తాడు. కొత్త హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ వెనుక ఉన్న అదృశ్య శ‌క్తి ప‌వ‌న్ క‌ల్యాణే అని మెగా స‌న్నిహితులు చెబుతున్నారు. రేయ్‌తో ఎంట్రీ ఇచ్చాడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌. ఆ సినిమా ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. అయినా స‌రే, సాయి చేతిలో ఆఫ‌ర్లే ఆఫ‌ర్లు. రెండో సినిమా పిల్లా నువ్వు లేనిజీవితం రిలీజ్ కాకుండానే మూడో సినిమా సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ ప‌ట్టాలెక్కేసింది. మ‌రో మూడు సినిమాలు సాయి చేతిలో ఉన్నాయి. ఈ ప్లానింగ్‌కి, దూకుడుకు కార‌ణం ప‌వ‌న్ క‌ల్యాణే న‌ట‌. సాయిలోని టాలెంట్ గుర్తించి, త‌న‌ని ఎలాగైనా పైకి తీసుకురావాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నాడట‌. మ‌రోవైపు చిరంజీవి సాయిని పూర్తిగా వ‌దిలేయ‌డం కూడా.. ప‌వ‌న్‌కి న‌చ్చ‌లేద‌ట‌. అందుకే... సాయి బాధ్య‌త‌ను తాను నెత్తిమీద పెట్టుకొన్నాడ‌ట‌. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ ఆఫ‌ర్లు రావ‌డానికి, అవి ఆఘ‌మేఘాల మీద ప‌ట్టాలెక్కేయ‌డానికి కార‌ణం.. ప‌వ‌న్ క‌ల్యాణేన‌ట‌. ''సాయితో మీకు ఢోకా లేదు. సినిమా తేడా వ‌స్తే నేను చూసుకొంటా'' అని ప‌వ‌న్ సైతం అభ‌య‌హ‌స్త‌మిచ్చాడ‌ట‌. ప‌వ‌న్ లాంటివాడే భ‌రోసా ఇస్తే ఇక అడ్డేముంది...?? పైగా ప‌వ‌న్ ఫ్యాన్స్ అండ సాయి సినిమాల‌కు ఉంటుంద‌న్న న‌మ్మ‌కం కూడా ఉంది. సో.. సాయిధ‌ర‌మ్ కెరీర్‌కి ప‌వ‌న్ గ‌ట్టి పునాదులే వేస్తున్నాడ‌న్న‌మాట‌.