English | Telugu
ఇదేం తలనొప్పి.. గోపాల..??
Updated : Dec 31, 2014
ఈ సంక్రాంతికి సందడి చేయాలనుకొన్న పవన్ సినిమా గోపాల గోపాలకు కొత్త తలనొప్పులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సినిమా సెన్సార్‌ని అడ్డుకొంటామని వీహెచ్‌పీ (అఖిల భారత హిందూ పరిషత్) హెచ్చరిస్తోంది. గోపాల గోపాలలో హిందూ మతాన్ని కించపరిచే అంశాలు ఉన్నాయని, మరీ ముఖ్యంగా కృష్ణుడి అవతారాన్ని ప్రశ్నించే అంశాలు ఉన్నాయని వీహెచ్‌పీ ఆరోపిస్తోంది. సెన్సార్ పూర్తయిన సినిమాని అడ్డుకొనే హక్కు ప్రభుత్వానికే కాదు, ఎవ్వరికీ లేదు. అందుకే ముందుగానే సెన్సార్ జరక్కుండా అడ్డుకొంటే.. విడుదలను ఆపేయొచ్చని వీహెచ్‌పీ కార్యకర్తలు భావిస్తున్నారు. మరోవైపు డి.సురేష్ బాబు ఈ సినిమా సెన్సార్‌ని గుట్టుచప్పుడు కాకుండా పూర్తిచేద్దామన్న సన్నాహాల్లో ఉన్నారు. జనవరి 4 లేదా 5 తేదీల్లో సెన్సార్ ముగిసే అవకాశం ఉంది. ఆ తరవాత కావలిస్తే కొంతమంది వీహెచ్‌పీ కార్యకర్తలకు సినిమా చూపిద్దామన్న ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమాని వీహెచ్‌పీ కార్యకర్తలు అంత తేలిగ్గా తీసుకొనే అవకాశమైతే కనిపించడం లేదు. గోపాలుడికి ఈ వ్యవహారం కాస్త తలనొప్పి సృష్టించే ఛాన్స్ ఉంది.