English | Telugu
పవన్ అభిమాని గొంతు కోసింది ఇతనే
Updated : Jan 6, 2015
ఆదివారం సాయంత్రం మాదాపూర్‌లోని శిల్పకళా వేదిక ఆవరణలో కొందరు యువకులు, పవన్ అభిమానిపై దాడి చేసిన విషయం తెలిసిందే! ‘గోపాల గోపాల’ ఫంక్షన్ సందర్భంగా శిల్పకళావేదిక గేటు ముందు ఎంట్రీ పాసుల కోసం జరిగిన గొడవలో శ్రీనివాస్ అనే ఫ్యాన్ గొంతును గుర్తు తెలియని వ్యక్తి కోసి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దాడి జరిగినప్పుడు పవన్‌కల్యాణ్ అభిమానులు సెల్‌ఫోన్‌లో తీసిన ఫొటోలను సేకరించారు. ఆ ఫోటోలను మీడియాకు రిలీజ్ చేశారు. ఆడియో ఫంక్షన్ రోజున నిందితుడు శిల్పకళా వేదిక వద్ద బ్లేడు పట్టుకుని తిరుగుతున్నట్లు ఫోటోలో కనిపిస్తోంది.ఈ కేసులో నిందితులైన వారిని ఎవరైనా గుర్తుపడితే మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు.