Read more!

English | Telugu

ఆదా శర్మ అందాలన్నీ ఆరబోసినప్పటికీ..

"హార్ట్ ఎటాక్" సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన అందాల భామ ఆదా శర్మకు ఈమధ్య ఆఫర్లు కరువయ్యాయి. ఈ అమ్మడు నటించిన "క్షణం" హిట్ అయినప్పటికీ ఆ సక్సెస్ క్రెడిట్ అంతా అనసూయ ఖాతాలోనే చేరిపోయింది. దాంతో అదాను ఎవరూ పట్టించుకోలేదు. మెగా హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసినప్పటికీ ఆమెను ఎవరూ గుర్తించలేదు. దాంతో అమ్మడు కొన్ని హాట్ ఫోటోషూట్లు చేయించుకొని మరీ మీడియాకి వదిలింది. ఏమాత్రం మొహమాటపడకుండా అందాలన్నీ ఆరబోసినప్పటికీ అమ్మడిని ఎవ్వరూ పట్టించుకోలేదు. దాంతో తమిళంలో ఒక ఐటెమ్ సాంగ్ లో కూడా నర్తించింది. అదీ పెద్దగా ఉపయోగపడలేదు. ఇప్పుడామె చేతిలో ఒకే ఒక్క బాలీవుడ్ సినిమా ఉంది. ఆ సినిమా పూర్తయ్యేలోపు మరో సినిమా చేజిక్కించుకోవాలని అదా విశ్వప్రయత్నాలు చేస్తోంది. మరి అదా ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి!