English | Telugu
10 నెలలు సినిమాలకు దూరం
Updated : Nov 11, 2014
పరిణితి చోప్రా.. ప్రియాంక చోప్రా చెల్లెలిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ అతి తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యింది. వరుస సినిమాల్లో నటిస్తూ నటనతోనూ, గ్లామర్‌తోనూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం 'కిల్ దిల్' సినిమా ప్రమోషన్ లో బిజీగా వున్న ఈ బాలీవుడ్ భామ ఆ సినిమా రిలీజ్ తరువాత పది నెలలు పాటు సినిమాలకు దూరంగా గడపాలని భావిస్తుందట. అలాగే ఈ సినిమాలో తన నటనను చూసి ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలని ఆసక్తిగా వున్నట్లు తెలిపింది. ప్రేక్షకుల స్పందనను బట్టి తన తరువాతి సినిమాను ఎంచుకుంటానని అంటోంది. ఈ మధ్యలో తన స్నేహితురాళ్ళతో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తుందట.