Read more!

English | Telugu

"ఒక మనసు"ను అప్పుడే కత్తిరించేశారు..!!

నిన్న విడుదలైన "ఒక మనసు" సినిమా చూడ్డానికి బాగానే ఉన్నప్పటికీ.. నత్తనడకలా సాగే కథనం మాత్రం ప్రేక్షకుడి సహనాన్ని పూర్తి స్థాయిలో పరీక్షిస్తుందని దాదాపుగా అందరూ విమర్శకులు పేర్కొన్నారు. నిహారిక-నాగశౌర్యల కెమిస్ట్రీ మెయిన్ హైలైట్ గా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను ఆకట్టుకొంటున్న "ఒక మనసు" లెంగ్త్ ఎక్కువయ్యిందని ప్రేక్షకులతోపాటు నిర్మాతలు కూడా భావించడంతో ఫస్టాఫ్ లో దాదాపు 14 నిమిషాల నిడివిగల సన్నివేశాలను కత్తిరించాలని ఫిక్స్ అయ్యారు. ఇవాల్టి నుంచి థియేటర్లో సినిమా చూసేవారికి ఆ నిడివి తగ్గుతుంది. ఇకపోతే.. నిహారికకు "ఒక మనసు" మంచి డెబ్యూ మూవీ అని అందరూ ఏకగ్రీవంగా ఒప్పేసుకొన్నారు. అయితే, తన తదుపరి చిత్రాలను సరిగా సెలక్ట్ చేసుకొంటే బాగుంటుంది, అలాగే ఇక నుంచి ఈ తరహా బరువైన పాత్రలు కాకుండా చలాకీ పాత్రల్లో నటిస్తే అమ్మాయికి కెరీర్ బాగుంటుందని విశ్లేషణలు వెల్లడవుతున్నాయి.