Read more!

English | Telugu

"కబాలి" పోస్టర్లు అక్కడ కూడా అతికించేశారట..!!

సినిమా ప్రమోషన్ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రమోషన్ బట్టి సినిమా స్థాయిని అంచనా వేస్తున్నారిప్పుడు. మన తెలుగు స్టార్ హీరోల సినిమాల ప్రమోషన్లే ఆకాశాన్నంటున్నాయి. అలాంటప్పుడు ఆలిండియా సూపర్ స్టార్ రాజనీకాంత్ సినిమా ప్రమోషన్ ఆకాశంలో చేయడం తప్పేముంది. మీరు విన్నది నిజమే. రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం "కబాలి" పోస్టర్లను ఏకంగా ఎయిరోప్లేన్ కు అతికించనున్నారట. నిన్నే ఓ విమాయయాన సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకొన్నారట. రోజుకి కొన్ని లక్షల మంది ప్రయాణించే విమానాలు దేశవిదేశాలు తిరుగుతుంటాయి. అందువల్ల సదరు ఫ్లైట్ ల్యాండ్ అయిన ప్రతి ఎయిర్ పోర్ట్ లో "కబాలి" ప్రమోట్ అవుతుంది. అందునా రజనీకాంత్ ను ఎరుగనివారు ఎవరూ ఉండరు కాబట్టి.. "కబాలి" పోస్టర్లు చూసి ఆశ్చర్యపోయేవారి కంటే ఆనందించేవారే ఎక్కువగా ఉంటారని నిర్మాతల ఆలోచన. "కబాలి" తప్పకుండా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకంతోనే నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా ఈ రేంజ్ లో పబ్లిసిటీ చేస్తున్నారు. సినిమా విడుదలయ్యాక వారి అంచనాలు నిజమై.. వారికి భారీ లాభాలు రావాలని ఆశిద్దాం!