Read more!

English | Telugu

రెహమాన్ కోసం కోహ్లీ పాట!

ఈమధ్య క్రికెటర్లు సినిమాల్లో మెరవడం, క్రికెటర్ల జీవితాలపై సినిమాలు తీయడం రెగ్యులర్ అయిపోయింది. ఇటీవలే క్రికెటర్ అజర్ జీవిత చరిత్రను బేస్ చేసుకొని "అజహర్" సినిమా వచ్చింది. సినిమా ఫ్లాపయినప్పటికీ.. ఆ సినిమా పుణ్యమా అని చాలామందికి అజర్ గురించి తెలియని చాలా విషయాలు తెలిసోచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో ధోనీ పై కూడా "ధోనీ" పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. త్వరలో "ధోనీ" సినిమా మన ముందుకు రానుంది. అలాగే క్రికెటర్ శ్రీశాంత్ ఇప్పుడు హీరోగా నటిస్తున్నాడు. తాజాగా సంచలన బ్యాట్స్ మేన్ విరాట్ ఓ పాట పాడాడని తెలుస్తోంది. ఎ.ఆర్.రెహమాన్ స్వర సారధ్యంలో ఈ పాట రూపొందింది. ఫుట్ బాల్ టోర్నీ కోసం ఈ పాట కంపోజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకూ క్రీజ్ లో విరాట్ బ్యాట్ తో చేసిన సాహసాలు చూసిన మనం త్వరలోనే మనం విరాట్ గళ విన్యాసాన్ని వినవచ్చు!