English | Telugu

థమన్‌ ఇలా చేశాడేంటి? ‘ఓజీ’ నుంచి ‘సువ్వీ సువ్వీ..’ సాంగ్‌ రిలీజ్‌! 

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ లేటెస్ట్‌ మూవీ ‘ఓజీ’పై అభిమానులు ఎన్నో హోప్స్‌ పెట్టుకున్నారు. ఈ సినిమాతో మరోసారి పవర్‌ స్టార్‌ తన పవర్‌ని చూపిస్తాడనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఆమధ్య విడుదలైన పవర్‌ స్టోర్మ్‌ సాంగ్‌తో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పాలి. వినాయక చవితి సందర్భంగా ‘ఓజీ’ చిత్రంలోని రెండోపాటను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ‘సువ్వీ సువ్వీ..’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌కి సంబంధించిన లిరికల్‌ వీడియో రిలీజ్‌ అయింది. కళ్యాణ్‌చక్రవర్తి రచించిన ఈ పాటకు థమన్‌ సంగీతం అందించగా శ్రుతిరంజని ఆలపించారు. బృంద మాస్టర్‌ కొరియోగ్రఫీ నిర్వహించారు.

ప్రతి డైరెక్టర్‌ తన సినిమాలోని పాటలకు సంబంధించిన లిరికల్‌ వీడియోలను డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ప్రజెంట్‌ చెయ్యాలనుకుంటాడు. సుజిత్‌ కూడా అలాంటి ఓ కొత్త కాన్సెప్ట్‌తో వెళ్దామని ప్లాన్‌ చేశాడు. కానీ, గతంలో థమన్‌ సంగీతంలోనే వచ్చిన కొన్ని పాటల తరహాలోనే ఈ పాట కూడా ఉంది. సింగర్స్‌, ఆర్కెస్ట్రాతో సాగే ఈ పాట కాన్సెప్ట్‌ పరంగా కొత్తగా అనిపించకపోయినా, పాట మెలోడీతో సాగుతూ ఆకట్టుకుంది. ఇటీవలి కాలంలో వస్తున్న పాటల మాదిరిగా కాకుండా సంగీతం, సాహిత్యం వీనుల విందుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు థమన్‌. ఇక పవన్‌కళ్యాణ్‌, ప్రియాంక మోహన్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ అద్భుతంగా ఉంది. కొన్ని సీన్స్‌ చాలా ఇంప్రెసివ్‌గా అనిపిస్తాయి.

‘ఓజీ’ సినిమా ఒక గ్యాంగ్‌ వార్‌ నేపథ్యంలో సాగే సినిమా అని టీజర్‌, పవర్‌స్టోర్మ్‌ సాంగ్‌ చూసిన తర్వాత అందరికీ క్లారిటీ వచ్చింది. కానీ, సినిమాలో లవ్‌, ఫ్యామిలీ, సెంటిమెంట్‌ అంశాలు కూడా ఉన్నాయని ‘సువ్వీ సువ్వీ’ సాంగ్‌ చూస్తే అర్థమవుతుంది. ఈ పాట ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుందని అందులోని విజువల్స్‌ చూస్తే తెలుస్తుంది. మొదటిసారి విన్నప్పుడు ఈ పాట అంతగా ఆకట్టుకోకపోయినా వినగా వినగా మంచి మెలోడీ సాంగ్‌ అనే ఒపీనియన్‌ కలుగుతుంది. ముఖ్యంగా వయొలిన్‌, ఫ్లూట్‌ వంటి వాయిద్యాలను చాలా చక్కగా వినియోగించారు. తప్పకుండా ఇది అందర్నీ ఆకట్టుకునే పాట అవుతుందని చెప్పడంలో సందేహం లేదు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.