Read more!

English | Telugu

డిసెంబర్ 7న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చిన్న సర్ ప్రైజ్!

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ సినిమా లాంచ్ ఎప్పుడు? షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? అనే విషయాలు తెలుసుకోవడం కోసం వారు ఆరాటపడుతున్నారు. అయితే 'ఎన్టీఆర్ 30' అప్డేట్ పై క్లారిటీ లేదు గానీ ఈ నెల 7న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒక చిన్న సర్ ప్రైజ్ ఉంది.

కార్తీక్ దండు దర్శకత్వంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన 15వ సినిమాని చేస్తున్నాడు. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బుధవారం నాడు ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ విడుదల చేస్తున్నారు. అయితే దీనికి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ వాయిస్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. 'ఎన్టీఆర్ 30' అనౌన్స్ మెంట్ వీడియోలో "వస్తున్నా" అంటూ ఆయన చెప్పిన వాయిస్ తెగ వైరల్ అయింది. ఇప్పుడు 'SDT 15' కోసం ఆయన చెప్పిన వాయిస్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

సాయి తేజ్, సుకుమార్, ఎస్వీసీసీ బ్యానర్ తో ఎన్టీఆర్ కి మంచి అనుబంధం ఉంది. సాయి తేజ్ కూడా ఎన్టీఆర్ అంటే ప్రత్యేక అభిమానం చూపిస్తుంటాడు. గతంలో సాయి తేజ్ నటించిన 'జవాన్' మూవీ లాంచ్ కి కూడా ఎన్టీఆర్ హాజరయ్యాడు.