Read more!

English | Telugu

అడివి శేష్ ఖాతాలో మరో 'హిట్'.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్

వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో అడివి శేష్ ఖాతాలో మరో హిట్ చేరింది. ఆయన నటించిన తాజా చిత్రం 'హిట్-2' మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.15 కోట్ల షేర్ రాబట్టింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలిచింది.

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం 'హిట్-2' తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.4.03 కోట్ల షేర్, రెండో రోజు రూ.3.28 కోట్ల షేర్, మూడు రోజు రూ.3.20 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.10.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. మూడు రోజుల్లోనే రూ.10.51 కోట్ల షేర్ రాబట్టి సత్తా చాటింది.

మూడు రోజుల్లో రెస్టాఫ్ ఇండియా రూ.1.20 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.3.20 కోట్ల షేర్ సాధించింది. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు రూ.6.43 కోట్ల షేర్, రెండో రోజు రూ.4.53 కోట్ల షేర్, మూడు రోజు రూ.3.95 కోట్ల షేర్ రాబట్టిన హిట్-2.. మూడు రోజులకు గాను రూ.14.91 కోట్ల షేర్(రూ.26.20 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసిందని సమాచారం. ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ రూ.14.25 కోట్లని అంచనా. అంటే మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకొని, నాలుగో రోజు నుంచి ప్రాఫిట్స్ లోకి ఎంటరైంది.