Read more!

English | Telugu

మెగా సర్ ప్రైజ్.. ఈ ఫోటో చూశారా!

మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. వివిధ రంగాలలో పైస్థాయిలో ఉన్నవాళ్లు సైతం ఆయనతో ఫోటో దిగడానికి పోటీ పడుతుంటారు. ఇటీవల గోవాలో ఆయనతో పలువురు నావికాదళ అధికారులు ఫోటో దిగారు. ఈ సందర్భంగా ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకున్న మెగాస్టార్.. ఫ్యాన్స్ కి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు.

ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోవడానికి ఇటీవల చిరంజీవి గోవా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎయిర్ పోర్టులో చిరుని చూసిన కొందరు నావికాదళ అధికారులు ఆయనతో ఫోటో దిగారు. ఈ ఫోటోని తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్న మెగాస్టార్.. అప్పట్లో యువకుడిగా ఉన్న సమయంలో ఎన్సీసీ కోసం యూనిఫామ్ ధరించిన ఫోటోని ఆయన షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.