English | Telugu

'టెంపర్' ఇండస్ట్రీని షేక్ చేస్తుందా?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వున్న మంచి నటులలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఏ పాత్రనైనా అవలీలగా చేయగల సత్తా ఆయన సొంతం. అయితే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని అన్న‌ట్టుగా త‌యారైంది ఎన్టీఆర్ కెరీర్. మంచి పెర్ఫార్మ‌ర్ అయినా మంచి సినిమా ప‌డ‌డం లేదు. అది ఎందుకో ఎవ‌రికీ అర్థం కానీ ప‌రిస్థితి. అయితే ఈసారి ఎలాగైనా పూరీ జ‌గ‌న్నాథ్ సినిమాతో హిట్ కొట్టాలని భావిస్తున్నాడట ఎన్టీఆర్. రీసెంట్ గా వచ్చిన 'టెంపర్' ఫస్ట్‌ లుక్‌ కూడా ఈ సినిమాపై భారీగా అంచ‌నాలు పెంచేసింది. టైటిల్‌, ఎన్టీఆర్‌ గెటప్‌ ఎలా ఎంత టెంపర్‌గా ఉన్నాయో, దానికన్నా డబల్‌కి డబల్‌ ఎన్టీఆర్‌ క్యారెక్టరైజేషన్‌లో టెంపర్‌ నింపాడట డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌. ఈ సినిమా ఇండస్ట్రీ షేకింగ్‌ హిట్‌ అవడం గ్యారంటీ అనే న్యూస్‌ కూడా ఇండస్ట్రీ వర్గాలలో నానుతుంది. మరి ఈ సినిమా అయిన నందమూరి అభిమానుల అంచనాలను నెరవేరుస్తుందో లేదో తెలుసుకోవాలంటే, రిలీజ్ వరకు ఆగాల్సిందే!

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.