English | Telugu

యన్ టి ఆర్ పెళ్ళి ఎక్కడ జరుగుతుంది!

యన్ టి ఆర్ పెళ్ళి ఎక్కడ జరుగుతుంది అనే దాని మీద ప్రస్తుతం ఫిలిం నగర్ లో చర్చలు జరుగుతున్నాయి. అభిమానులు ఆంధ్ర ప్రదేశ్ నలుమూలల నుండి వస్తారు కనుక అంతమందిని నిభాయించాలంటే చాలా ప్రదేశం అవసరమవుతుంది కనుక యల్.బి.స్టేడియంలో యన్ టి ఆర్ పెళ్ళి జరిగితే అందరికీ వసతిగా ఉంటుందని, కనుక అక్కడే యన్ టి ఆర్ పెళ్ళి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ జనం అనుకుంటున్నారు.

లేకుంటే షంషాబాద్ గ్రౌండ్స్ లో అయితే మరింత విశాలంగా ఉంటుందనీ, గతంలో హోం మినిస్టర్ సబితా ఇంద్రా రెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి పెళ్ళి కూడా షంషా బాద్ గ్రౌండ్స్ లోనే జరిగింది. అయితే షంషా బాద్ గ్రౌండ్స్ హైదరాబాద్ సిటీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల, అక్కడికి తన అభిమానులు రావటానికి ఇబ్బంది పడతారని యన్ టి ఆర్ ఆలోచిస్తున్నాడట. హైటెక్స్ లో తన పెళ్ళి చేసుకుంటే అందరికీ అందుబాటులో ఉంటుందని, కానీ వేలసంఖ్యలో వచ్చే తన అభిమానులు ఆ హైటెక్స్ లో సరిపోతారా...? వి ఐ పి లకు ఇబ్బందిగా ఉంటుందా అనే అనుమానాలు యన్ టి ఆర్ ని వేధిస్తున్నాయట.

అతని మామగారు మాత్రం అల్లుడు పెళ్ళి ఎక్కడ చేయమంటే అక్కడ, ఎలా చేయమంటే అలా, ఎంత ఖర్చుపెట్టమమటే అంతా ఖర్చుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వినికిడి. యన్ టి ఆర్ పెళ్ళికి సుమారు వంద కోట్లు ఖర్చు అవుతాయని అనుకుంటున్నారు.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.