English | Telugu
మే 20 న జరిగే పుట్టినరోజుని ఫ్యాన్స్ మర్చిపోలేరు..ఆ ప్రకటన రాబోతుందా!
Updated : May 5, 2025
గత ఏడాది 'దేవర'(Devara)తో భారీ విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్(Ntr)తన తదుపరి చిత్రాన్ని కెజీఎఫ్ సిరీస్, సలార్ ఫేమ్ 'ప్రశాంత్ నీల్'(Prashanth Neel)దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్, దేవరతో ఎన్టీఆర్ ఇమేజ్ పాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళింది. ఇందుకు నిదర్శనంగా దేవర ఇటీవల చైనా(China)లో రిలీజయ్యి రికార్డు కలెక్షన్స్ ని సృష్టించింది. పైగా ఎన్టీఆర్ కోసం చైనాకి చెందిన కొంత మంది అభిమానులు తెలుగుభాష నేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవ్వగా ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలని కూడా చిత్రీకరించారు.
ఇక మే 20 న ఎన్టీఆర్ పుట్టినరోజు. అభిమానులకి పండుగ రోజు. ఈ పండుగ రోజు వాళ్ళ ఆనందం రెట్టింపు అయ్యేలా ప్రశాంత్ నీల్ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్ ని విడుదల కానుంది. ఈ విషయాన్నీ చిత్ర బృందం ఇప్పటికే అధికారంగా ప్రకటించింది. ఇదే రోజు ఎన్టీఆర్ ఫస్ట్ టైం బాలీవుడ్ లో చేస్తున్న 'వార్ 2కి సంబంధించిన ఎన్టీఆర్ లుక్ తో పాటు, గ్లింప్స్ ని కూడా రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి అధికార ప్రకటన రాలేదు. కానీ ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఫ్యాన్స్ కి ట్రీట్ మాత్రం పక్కా అని బాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి.
'వార్ 2 ' షూటింగ్ గత ఏడాది మార్చిలో ప్రారంభమవ్వగా ఎన్టీఆర్ ఏప్రిల్ లో జాయిన్ అయ్యాడు. దీంతో అప్పట్నుంచే ఎన్టీఆర్ లుక్ బయటకి వస్తుందేమో అని అభిమానులు ఆశగా ఎదురుచూసారు. కానీ ఇప్పుడు బర్త్ డే కి రిలీజ్ చేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో వస్తుండటం ఫ్యాన్స్ కి మంచి కిక్ ని ఇస్తుంది. వార్ 2(War 2)లో హృతిక్ రోషన్(Hrithik Roshan)తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటుండగా, ఆగస్టు 14 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. దేవర పార్ట్ 2 కి సంబంధించిన అప్ డేట్ కూడా రానున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆల్రెడీ ఎన్టీఆర్ ఇటీవల ఒక ఫంక్షన్ లో దేవర పార్ట్ 2 తప్పకుండా ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే.