English | Telugu

లిప్‌లాక్ ఏమైంది త్రివిక్ర‌మ్‌..??

నో డౌట్‌... త్రివిక్ర‌మ్ సినిమా అంటే కుటుంబం అంతా క‌ల‌సి చూసేలా ఉంటుంది. త్రివిక్ర‌మ్ బ‌ల‌మే అది. నువ్వే నువ్వే నుంచి.. నిన్న‌టి అత్తారింటికి దారేది వ‌ర‌కూ త్రివిక్ర‌మ్‌కి విజ‌యాల్ని అందించింది ఈ ఫార్ములానే. ఇప్పుడు స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి కూడా ఓ ఫ్యామిలీ డ్రామానే. కాక‌పోతే ఇందులో ల‌వ్ స్టోరీ(స్‌) మిక్స్ అయ్యాయి. యూత్ కి ఐకాన్ లాంటి బ‌న్నీ ఉన్నాడు. ముగ్గురు హీరోయిన్లున్నారు. అందుకే స‌ర‌దాగా లిప్‌లాక్ పెట్టించాల‌నిపించింది త్రివిక్ర‌మ్‌కి. బ‌న్నీ - ఆదాశ‌ర్మ‌ల‌మ‌ధ్య ఓ పెద‌వెంగిలి ముద్దు తెర‌కెక్కించాడ‌ట‌. అయితే... త‌న‌పై ఉన్న ఫ్యామిలీ ముద్ర ఎక్క‌డ చెడిపోతుందో అన్న ఉద్దేశంతో ఆ సీన్ లేకుండానే... సెన్సార్ చేయించేశాడు త్రివిక్ర‌మ్‌. అంటే త్రివిక్ర‌మ్ ఎంతో ముచ్చ‌ట ప‌డి తీసిన ముద్దు సీన్ సినిమాలో లేద‌న్న‌మాట‌. మ‌రి ఆ సీన్ ఎందుకు షూట్ చేశాడో ఏంటో..? క‌నీసం సినిమా విడుద‌ల‌య్యాక యూ ట్యూబ్‌లో అయినా విడుద‌ల చేస్తే.. జ‌నం చూసి త‌రిస్తారుగా..?!

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.