English | Telugu

త్రివిక్రమ్‌కు షాకిస్తున్న హీరోయిన్?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమాలలో హీరోయిన్‌ అవకాశం రాగానే ఎగిరిగంతేస్తారు. కానీ దానికి భిన్నంగా త్రివిక్రమ్‌ సెలెక్ట్ చేసుకున్న హీరోయిన్ ఆయనకు తలనొప్పిగా మారిందట. ఇప్పుడే ఇదే విషయంపై ఫిలింనగర్‌లో హాట్‌ టాఫిక్‌గా మారింది. ఇంతకు ఆ హీరోయిన్‌ ఎవరో కాదు. టాలీవుడ్ టాలెంట్ హీరోయిన్ అయిన నిత్యామీనన్. త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమాలో మూడవ హీరోయిన్ గా ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్న నిత్యామీనన్, తన వ్యవహార శైలితో త్రివిక్రమ్ ను ఆశ్చర్యానికి గురిచేస్తుందని టాక్. నిత్యామీనన్‌కు ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేకపోయినప్పటికి పిలిచి మరీ తన సినిమాలో అవకాశం ఇచ్చాడు త్రివిక్రమ్‌. అయితే నిత్యామీనన్‌ ఈ సినిమాలో షూటింగ్‌ లో ఒక టాప్‌ హీరోయిన్‌ వ్యవహరించిన తీరుగా ప్రవర్తిస్తుందట. దర్శకుడు త్రివిక్రమ్‌కే స్క్రిప్ట్ లో సూచనలు, సలహాలు ఇస్తుందట. దీనితో ఒకింత షాక్‌కు గురైన త్రివిక్రమ్‌ ఈ సినిమాలో నిత్యకు ఎందుకు అవకాశం ఇచ్చానని బాధపడుతున్నాడట.