Read more!

English | Telugu

అతనికి బ్రేకప్ చెప్పిన నిత్యామీనన్...!

నటనకు పర్యాయపదంగా పేర్కొనబడే మలయాళ కుట్టి నిత్యామీనన్ గురించి కొత్తగా చెప్పేదేముంది. నట సామర్ధ్యం మెండుగా ఉన్న ఈ అమ్మడికి తల పొగరు కూడా కాస్త ఎక్కువని చెప్పుకొంటూ ఉంటారు. ఇప్పటివరకూ ఇండస్ట్రీలో "లవ్ ఎఫైర్" లేని ఒకేఒక్క నటిగానూ నిత్యకు గుర్తింపు ఉంది. అయితే.. నిత్యామీన మనం అనుకొన్నంత అమాయకురాలేమీ కాదు. అమ్మడికి చదువుకొనే సమయంలోనే ఘాడమైన ప్రేమకథ ఉందట. కొన్నాళ్లు తన జతగాడితో ప్రేమాయణం సాగించాక.. అతడితో జీవితాంతం కలిసి సంతోషంగా ఉండలేనని భావించి.. అప్పట్లోనే అతడితో బ్రేకప్ చేసుకొందట. ఈ విషయాన్ని స్వయంగా నిత్యామీనన్ ఇటీవల ఓ తమిళ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. మరి పొట్టివారు గట్టివారు అని ఉరకనే అన్నారా మన పెద్దాళ్ళు. నిత్యను చూస్తే ఆ నానుడి నిజమే అనిపించకమానదు!