Read more!

English | Telugu

ట్విట్టర్ లో "బాబు బంగారం" ట్రైలర్

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న "బాబు బంగారం" మ్యూజిక్ టీజర్ నేడు విడుదలైంది. రెగ్యులర్ బీట్స్ కాకుండా రెట్రో మ్యూజిక్ బీట్ తో జిబ్రాన్ కంపోజ్ చేసిన మ్యూజిక్ బీట్ అందర్నీ అమితంగా ఆకట్టుకొంటోంది. ఇప్పటికే పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుండడం, తాజా మ్యూజిక్ టీజర్ కూడా ఆకట్టుకోంటుండడంతో ఇదే ఊపులో థియేటర్ ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నారు చిత్ర బృందం. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ను జూలై 9న ట్విట్టర్ ద్వారా విడుదల చేస్తారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను జూలై 29న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి!