Read more!

English | Telugu

డాలీకి పవన్ కళ్యాణ్ డెడ్ లైన్ పెట్టాడు!

పవన్ కళ్యాణ్ 'సర్ధార్ గబ్బర్ సింగ్' తరువాత ఎస్.జె.సూర్య దర్శకత్వంలో కొత్త సినిమాకు రెడీ అయ్యాడు. అయితే సడెన్ గా ఎస్.జె.సూర్య ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడం తన స్థానంలోకి డాలీ రావడం జరిగింది.   మరి, ఇందులో లోగుట్టు ఏమిటో గానీ మార్పు అయితే జరిగిపోయింది. అయితే డాలీ తీసుకొనేటప్పుడు మాత్రం పవన్ ఓ కండీషన్ పెట్టాడట. ఈ సినిమాని 100 రోజుల్లో ఫినిష్ చేయాలనే డెడ్ లైన్ పెట్టినట్లు సమాచారం. ఈ డెడ్ లైన్ కు డాలీ అంగీకరించిన తర్వాతే అఫీషియల్ అనౌన్సమెంట్ చేశారట. పవన్ సినిమా బాగా లేట్ అనే కంప్లైట్ ఎప్పుడూ వుండేది. అయితే వచ్చే ఎన్నికల నాటికి త్వరగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్న పవన్ .. ఇక గేర్ మార్చాలని డిసైడ్ అయ్యారట. ఇది ఫ్యాన్స్ కు ఖుషి చేసే న్యూసే. మూడు నెలల్లో సినిమాను పూర్తి చేసి తనకున్న సమయంలో మరిన్ని సినిమాలు చేయడానికి పవన్ ఇలాంటి కండీషన్స్ పెడుతున్నట్లు తెలుస్తోంది. మరి డాలీ ఏమేరకు పవన్ కండీషన్ ను ఫాలో అవుతాడో చూడాలి..!