English | Telugu
పెళ్ళి చేసుకోను... నటన మానేస్తాను: మెగా హీరోయిన్
Updated : Mar 12, 2016
నిహారిక ఢీ జూనియర్స్ ప్రోగ్రామ్ ద్వారా ముందు బుల్లి తెరకు పరిచయమై మంచి పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె హీరోయిన్ గా కూడా ఎంట్రీ అవ్వబోతుంది. అయితే ఇక్కడి వరకూ బానే ఉన్నా ఇప్పుడు నిహారిక ప్రధాన పాత్రలో 'ముద్ద పప్పు ఆవకాయ్' అనే వెబ్ సీరీస్ యూట్యూబులో ప్రసారం అవుతున్న నేపథ్యంలో దానికి వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు.
తాజాగా ఈ అమ్మడు లైవ్ చాట్లోకి వచ్చారు. అక్కడ ఈమె ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలలో కొన్నింటికి షాకింగ్ సమాధానం ఇచ్చింది. ఒక ఫ్యాన్ ప్లయింగ్ కిస్ అడగా ఆ గాలికి మీరు ఎగిరిపోతారని తెలివైన సమాధానం చెప్పింది. అంతే కాకుండా చాన్స్ వస్తే మా అన్నయ్యతో, పెద్దనాన్న 150 వ సినిమాలో కూడా నటిస్తానని చెప్పింది. కాగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటా అని కొందరు ఫ్యాన్స్ అడగ్గా షాకింగ్ సమాధానం ఇచ్చింది నిహారిక. నా నటన మీకు నచ్చకుంటే నచ్చలేదు, సినిమాలు మానేయండి అని చెప్పండి, సినిమాలు చేయడం మానేస్తాను…. అంతేకానీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అనే ప్రశ్నలు మాత్రం దయచేసి అడగొద్దు అంటూ రిక్వెస్ట్ చేసింది నిహారిక.