English | Telugu
నాగబాబుగారమ్మాయి ఫస్ట్ లుక్ వచ్చేసింది
Updated : Mar 7, 2016
ఇప్పటికే యాంకర్ గా బోలెడంత మంది ఫ్యాన్స్. దానికి తోడు కొణిదెల వారమ్మాయి. మరి ఎంట్రన్స్ మామూలుగా ఉంటుందా. ఇప్పటికే నీహారిక సినిమా ఎలా ఉంటుందోనని, మెగాఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. కష్టపడి, ఫ్యామిలీలో అందర్నీ ఒప్పించి సినిమాల్లోకి రాబోతోంది నీహారిక. నాగశౌర్య, నీహారిక జంటగా రాబోతున్న సినిమా ఒక మనసు. మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వులాంటి సెన్సిబుల్ సినిమాను తెరకెక్కించిన రామరాజు డైరెక్షన్ లో ఈ మూవీ రాబోతోంది.
మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజే రిలీజైంది. హీరో హీరోయిన్లు ఇద్దరూ పరిగెడుతున్నట్టుగా ఉన్న ఈ పోస్టర్లో, ఇద్దరి ముఖాలూ సరిగ్గా కనిపించవు. కేవలం టీజింగ్ పోస్టర్ లా దీన్ని రిలీజ్ చేశారు. నీహారిక అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా చీరకట్టులో కనిపించడం విశేషం. ' ఒక మనసు ' పల్లెటూరి ప్రేమకథ అని సమాచారం. ఈ వేసవికి సినిమాల్లో తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతోంది నీహారిక. బుల్లితెర మీద ఆమెను బాగానే ఆదరించిన ప్రేక్షకులు, వెండితెరపై ఎంతవరకూ ఆదరిస్తారో చూడాలి.