English | Telugu

వీరమల్లు ట్రైలర్.. ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రాబోతుంది. చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న 'హరి హర వీరమల్లు' షూటింగ్ ఇటీవల పూర్తయిన సంగతి తెలిసిందే. జూన్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. త్వరలో ట్రైలర్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ కట్ పూర్తయిందని, అవుట్ పుట్ అదిరిపోయిందని వినికిడి. (Hari Hara Veera Mallu)

పవన్ కళ్యాణ్ సినిమా అంటే తెలుగునాట ఏ స్థాయి హడావుడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పవన్ రాజకీయాలతో బిజీ కావడంతో సినిమాలకు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. అందుకే వీరమల్లు బాగా ఆలస్యమైంది. అయినప్పటికీ ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటిదాకా విడుదలైన ప్రచార చిత్రాలు మెప్పించాయి. ఇక త్వరలో విడుదల కానున్న ట్రైలర్ తో వీరమల్లుపై అంచనాలు మరో స్థాయికి వెళ్లడం ఖాయమని చెబుతున్నారు. ట్రైలర్ కట్ ఓ రేంజ్ లో ఉందని, ఈమధ్య కాలంలో ఇదే బెస్ట్ ట్రైలర్ కట్ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. పీరియాడికల్‌ యాక్షన్‌ ఫిల్మ్ గా రూపుదిద్దుకుంటున్న వీరమల్లు నుంచి ట్రైలర్ విడుదలైతే.. పాన్ ఇండియా వైడ్ గా సౌండ్ చేయడం ఖాయమని అంటున్నారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.