English | Telugu

‘బాహుబలి, కె.జి.ఎఫ్‌’ చిత్రాల తరహాలో మెస్మరైజ్‌ చేస్తున్న మలయాళ చిత్రం ‘మార్కో’!

మన భారతీయ సినిమా రంగానికి చెందిన 1000 కోట్ల క్లబ్బులో... హిందీ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు స్థానం దక్కించుకున్నాయి. కానీ మలయాళం నుంచి ఇప్పటివరకు ఏ సినిమా కూడా చోటు సంపాదించుకోలేదు. ఈ లోటును భర్తీ చేసే బాధ్యతను ‘మార్కో’ తీసుకుంది. ఈనెల 20న విడుదలైన ఈ చిత్రం మలయాళంలో వసూళ్ల సునామి సృష్టిస్తుండగా... తొలిసారి హిందీలో థియేట్రికల్‌ రిలీజ్‌ జరుపుకున్న ‘మార్కో’ అక్కడ కూడా ప్రభంజనం సృష్టిస్తోంది.

ఉన్ని ముకుందన్‌ టైటిల్‌ రోల్‌ ప్లే చేసిన ఈ చిత్రాన్ని హనీఫ్‌ అదెని దర్శకత్వంలో క్యూబ్స్‌ ఎంటర్టైన్మెంట్‌ పతాకంపై షరీఫ్‌ మహ్మద్‌ నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో హిందీ వెర్షన్‌కు లభిస్తున్న అనూహ్య స్పందనను దృష్టిలో ఉంచుకుని... మరిన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు ‘జినీవర్స్‌’ సంస్థ సన్నాహాలు చేస్తోంది.

‘జినీవర్స్‌’ అధినేత బల్వంత్‌ సింగ్‌ మాట్లాడుతూ... ‘బాహుబలి, కె.జి.ఎఫ్‌, కాంతార, తాజాగా పుష్ప-2’ చిత్రాల గురించి మాట్లాడుకున్నట్లుగా... ‘మార్కో’ గురించి మాట్లాడుకుంటారని కచ్చితంగా చెప్పగలను. మన రెండు తెలుగు రాష్ట్రాలలో ‘మార్కో’ హిందీ వెర్షన్‌ ప్రభంజనం సృష్టిస్తోంది. అందుకే రేపటి నుంచి మరిన్ని థియేటర్లు పెంచుతున్నాం’ అన్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.