English | Telugu
నయనతార జైల్లో గడిపిందా..?
Updated : Mar 3, 2016
నయనతార జైల్లో లైఫ్ గడిపింది. ఆ విషయం తన లవర్ కు చెప్పింది. తన ఫ్లాష్ బ్యాక్ లో ఎన్నో భయంకరమైన నిజాలున్నాయని అతనికి వెల్లడించింది. అయినా కానీ బెదరని ఆ లవర్, ఆమె ప్రేమను దక్కించుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. చివరికి అనుకున్నది సాధించాడు. కంగారు పడకండి. ఇదంతా తమిళంలో వచ్చిన ' నన్బెండా ' సినిమా స్టోరీ. నయనతార, ఉదయనిధి స్టాలిన్ కాంబినేషన్ లో అక్కడ సూపర్ హిట్టయిన ఈ మూవీని భద్రకాళీ ఫిలిమ్స్ అధినేత ప్రసాద్ ' గుడ్ ఈవెనింగ్ ' పేరుతో తెలుగులోకి తీసుకొస్తున్నారు. హారిస్ జైరాజ్ సంగీతం అందించిన ఈ సినిమాకు, ఎ.జగదీష్ దర్శకత్వం వహించారు. సినిమాకు సంతానం కామెడీ హైలెట్ గా నిలుస్తుంది. ఈ నెలలోనే సినిమాను రిలీజ్ చేస్తున్నామన్నారు నిర్మాత ప్రసాద్. కరుణాకరన్, షాయాజీషిండే ముఖ్యపాత్రలు పోషించారు.