English | Telugu
నయనతార పెళ్లి 'గుట్టు' విప్పబోతోందా?
Updated : Jun 16, 2015
తమిళ దర్శకుడు విఘ్నేష్ శివమ్ తో నయత తార ప్రేమాయణం నడుపుతోందన్నది బహిరంగ రహస్యమైపోయింది. ఎవరికైనా డౌట్లొస్తే.. ఈమధ్య నయన తీసుకొన్న సెల్ఫీ.. ఆ అనుమానాల్ని పటాపంచలు చేసింది. శివమ్ - నయన హాట్ సెల్పీ.. ఇప్పుడు తమిళ సీమలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ సెల్పీ ద్వారా తమ మధ్య ఉన్న అనుబంధాన్ని నయనతార అందరికీ తెలియపర్చాలనుకొందన్నది అర్థమవుతోంది. ఇటీవల వీళ్లిద్దరూ పెళ్లి చేసుకొన్నారన్న వార్తలొచ్చాయి. వాటిని ఇద్దరూ ఖండించారు కూడా. అయితే తమమధ్య ఏమీ లేదన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేకపోయారు. త్వరలో తమ అనుబంధం గుట్టు మీడియా ముందు విప్పేయాలని నయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు తగిన సమయం, వేదిక గురించి ఆలోచిస్తోందట.
ప్రస్తతం తిరునాళ్ అనే తమిళ సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది నయన. కుంభకోణంలోని ఓ బస చేస్తోంది. ఆ హోటల్‌లో శివమ్, నయన పక్కపక్క గదుల్లోనే మకాం పెట్టారట. ఈ సెల్ఫీ కూడా అక్కడ తీసుకొన్నదే అని తెలుస్తోంది. బయటికి వచ్చిన మరుసటి రోజు నుంచీ నయనతార కాస్త అసహనంగా కనిపిస్తోందట. ఓ రోజు షూటింగ్ ని క్యాన్సిల్ చేసేసి హోటల్ రూమ్ లోనే ఉండిపోయిందట. ఇక ఎంతో కాలం ఈ రహస్యం దాచడం కష్టమనుకొంటున్న నయన త్వరలోనే ఈ రహస్యాన్ని బహిర్గతం చేయాలనుకొంటుందని సమాచారం. త్వరలోనే నయన నుంచి పెళ్లి కబురు వినొచ్చు.