English | Telugu

ఈరోజే న్యాచురల్ స్టార్ టీజర్ రిలీజ్..!

న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న లేటెస్ట్ సినిమా జెంటిల్ మన్. అష్టాచమ్మా తర్వాత ఇంద్రగంటి మోహన కృష్ణ నాని కాంబోలో వస్తున్న సినిమా ఇది. ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు. నాని సరసన సురభి హీరోయిన్ గా నటిస్తుండగా, చాలా కాలం తర్వాత మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇప్పటికే మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన లభించింది. హీరోనా, విలనా అంటూ ప్రేక్షకులకు ప్రశ్నలు సంధిస్తూ, ఆసక్తిని రేకెత్తిస్తున్నారు మూవీ టీం. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో, నాని రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని సమాచారం.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.