English | Telugu

అల్లరోడికి టెన్ష‌న్ ప‌ట్టుకొంది

వ‌రుస ఫ్లాపుల‌తో మినిమం గ్యారెంటీ అనే ట్యాగ్ లైన్‌కి తుప్పు ప‌ట్టించుకొన్నాడు అల్ల‌రి న‌రేష్‌. ఒక‌టా రెండా... వ‌రుస‌గా అర‌డ‌జ‌ను సినిమాలు తుస్సుమ‌న్నాయి. దాంతో న‌రేష్ డేంజ‌ర్ జోన్‌లో ప‌డిపోయాడు. ఇప్పుడు ఓ హిట్టు కొట్టి త‌న‌ని తాను నిరూపించుకోవ‌డం మిన‌హా మ‌రో గత్యంత‌రం లేదు. అదీ.. బందిపోటు ద్వారానే కొట్టాలి. ఎందుకంటే... హీరోగా, నిర్మాత‌గా ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు న‌రేష్‌. మ‌రోవైపు క్లాస్ చిత్రాల దర్శ‌కుడిగా పేరొందిన ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ న‌రేష్ టైపు ఊర కామెడీ చేయ‌గ‌ల‌డా, లేదంటే క్లాసిక‌ల్ కామెడీలో న‌రేష్ ఇమిడిపోగ‌ల‌డా?? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. చాలా కాలం త‌ర‌వాత త‌న సొంత సంస్థ ఈవీవీ సినిమాస్ ప‌తాకంపై వ‌స్తున్న సినిమా ఇది. కాబ‌ట్టి తండ్రి పేరు నిల‌బెట్టాల‌న్నా అల్ల‌రోడికి హిట్ ప‌డాల్సిందే. నిజానికి ఈనెల 6న ఈ సినిమా విడుద‌ల కావాలి. అయితే టెంప‌ర్ కి భ‌య‌ప‌డిన ఈ బందిపోటు కాస్త వెన‌క్కి త‌గ్గాడు. ఇప్పుడు ఫిబ్ర‌వ‌రి 20న రావ‌డానికి స‌మాయాత్తం అవుతున్నాడు. హీరోగా, నిర్మాత‌గా త‌న భ‌విష్య‌త్తు తెల్చేది ఈ బందిపోటే. అందుకే.. అల్ల‌రోడికి అంత టెన్ష‌న్ ప‌ట్టుకొంది. చివ‌రికి ఏమ‌వుతుందో చూడాలి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.