English | Telugu

ఫీల్ గుడ్ లవ్ స్టోరీలో నందమూరి మోక్షజ్ఞ!.. పూర్తి వివరాలు ఇవే  

'గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి 'బాలకృష్ణ'(Balakrishna)నటవారసుడు 'మోక్షజ్ఞ'(Mokshagna)సినీ రంగ ప్రవేశం కోసం అభిమానులతో పాటు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తు వస్తున్నారు. మోక్షజ్ఞ ఎలాంటి సబ్జెట్ లో కనపడతాడనే క్యూరియాసిటీ కూడా వాళ్లందరిలో ఉంది. నందమూరి హీరోలైతే మాత్రం సుదీర్ఘ కాలం నుంచి మాస్ సినిమాలకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటున్నారు. అంతలా మాస్ ఆడియెన్స్ లో ఇమేజ్ ఉంది. దీంతో అభిమానుల్లో చాలా మంది మోక్షజ్ఞ తన తాత ఎన్టీఆర్(Ntr),నాన్న బాలయ్య, సోదరుడు జూనియర్ ఎన్టీఆర్(Jr ntr)లెగసి ని కంటిన్యూ చేస్తు, మాస్ సబ్జెట్ తో తెరంగ్రేటం చెయ్యాలని కోరుకుంటున్నారు.

రీసెంట్ గా 'మోక్షజ్ఞ' కి సంబంధించిన లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రశాంతమైన చిరునవ్వుని చిందిస్తు క్లాస్ లుక్ తో ఉన్నాడు. అభిమానులైతే మోక్షజ్ఞ పిక్ చూస్తుంటే, వింటేజ్ బాలయ్య ని చూసినట్టుగా ఉందనే వ్యాఖ్యలు చేస్తున్నారు. రీసెంట్ గా ప్రముఖ హీరో 'నారా రోహిత్'(Nara Rohit)ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో ఆయన మాట్లాడుతు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ, ఈ ఏడాది చివర్లో లేదా నెక్స్ట్ ఇయర్ మొదట్లో ఉండే అవకాశం ఉంది. ఇటీవల మోక్షజ్ఞ తో మాట్లాడితే స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. సినిమాల కోసం తన లుక్ మార్చుకుంటున్నాడు. గతంలో లుక్ కంటే ఇప్పుడు పూర్తి మార్పు వచ్చింది. 'ఫీల్ గుడ్ లవ్ స్టోరీ' కోసం ఎదురుచూస్తునట్టుగా చెప్పాడని నారా రోహిత్ తెలిపాడు.


నారా రోహిత్ చెప్పిన ఈ మాటలు వైరల్ గా నిలిచాయి. ఒక వేళ మోక్షజ్ఞ లవ్ సబ్జెట్ చేస్తే దర్శకుడు, హీరోయిన్ ఎవరనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. అభిమానులు కూడా మోక్షజ్ఞ లవ్ సబ్జెట్ చేసినా, మాస్ అంశాలని ని వదలకుండా ఉండాలని కోరుకుంటున్నారు. బాలకృష గతంలో ఒక సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతు ప్రెజంట్ జనరేషన్ కి నచ్చినట్టుగా మోక్షజ్ఞ అన్ని రకాల పాత్రలు చెయ్యాలని చెప్పిన విషయం తెలిసిందే.


అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.