English | Telugu
నా తండ్రి మీద ప్రేమ తగ్గడం లేదు.. మీకు నేను చెప్పేది నిజం!
Updated : Jan 3, 2024
గత నెల డిసెంబర్ 1 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి ఘన విజయం సాధించిన మూవీ యానిమల్. రణబీర్ కపూర్ విధ్వంసకరమైన నటనకి మెరుపు వేగం లాంటి సందీప్ రెడ్డి దర్శకత్వం తోడవ్వడంతో యానిమల్ వరల్డ్ వైడ్ గా వసూళ్ల సునామీని సృష్టించింది. సుమారు 900 కోట్లు దాకా వసులు చేసిన యమినల్ కి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి మూవీ లవర్స్ లో జోష్ ని తెచ్చింది.
యమినల్ మూవీ నుంచి నాన్న నువ్వు నా ప్రాణం అనే పల్లవి తో ప్రారంభం అయ్యే వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. సాంగ్ మొత్తం సూపర్ గా ఉంది. అనంత శ్రీరామ్ సాహిత్యంలో వచ్చిన ఆ పాటలోని ప్రతి అక్షరం కూడా ఒక కొడుకు తన తండ్రిని ఎంతగా ప్రేమిస్తాడో అని చెప్పడంతో పాటుగా తండ్రి ప్రేమని పొందటానికి కొడుకు ఎంతగా పరితపిస్తాడో కూడా తెలియచేస్తుంది.అలాగే సాంగ్ విడుదలయిన కాసేపట్లోనే రికార్డు స్థాయిలో వ్యూయర్స్ ని సాధిస్తు ముందుకు దూసుపోతుంది.అలాగే సినిమాలో సాంగ్ మొత్తం లేకపోవడంతో డల్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు పూర్తి స్థాయి లిరిక్స్ తో సాంగ్ రిలీజ్ కావడంతో ఎంతో ఆనందపడుతున్నారు.
కాగా మూవీ లవర్స్ కి మరింత కిక్ ని ఇవ్వడం కోసం యానిమల్ అతి త్వరలోనే ఓటిటి ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజ్ కాబోతున్న యానిమల్ విడుదల తేదీని సంస్థ యాజమాన్యం అతి త్వరలోనే ప్రకటించబోతుంది.
