English | Telugu
‘దసరా’ విలన్‌కి పెళ్ళంట.. వైరల్ అవుతున్న ఎంగేజ్‌మెంట్ స్టిల్స్!
Updated : Jan 3, 2024
గత సంవత్సరం సినిమా రంగంలో ఎంతో మంది సెలబ్రిటీలు ఓ ఇంటివారయ్యారు. ఈ కొత్త సంవత్సరంలో మరో సెలబ్రిటీ వెడ్డింగ్ బెల్స్ మోగించబోతున్నాడు. అతనే ‘దసరా’ విలన్ షైన్ టామ్ చాకో. గత కొంత కాలంగా తనూజ అనే అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నాడు చాకో. సోషల్ మీడియాలో వీరి ఫోటోలు చాలా వైరల్ అయ్యేవి. వీరి గురించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేవి. అయితే వాటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ తను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు చాకో. ఇటీవలే వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ అయింది. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది.
కేరళకు చెందిన టామ్ చాకో 2011లో నటుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించిన చాకో ‘బీస్ట్’ చిత్రం ద్వారా తమిళ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. గత సంవత్సరం నాని హీరోగా వచ్చిన ‘దసరా’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘రంగబలి’ చిత్రంలో నటించాడు. ఇప్పుడు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ‘దేవర’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటి వరకు మలయాళం, తమిళ్, తెలుగు భాషల్లో 50కి పైగా సినిమాల్లో వివిధ పాత్రలు పోషించిన చాకోకి టాలీవుడ్‌లో మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నాడట. అందుకే తెలుగు సినిమాల్లో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు.
