English | Telugu
సక్సెస్ కోసం ఆ ఇద్దరూ కలిశారు..!
Updated : Aug 27, 2014
టాలీవుడ్ లో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నాని యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతితో జతకట్టుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో మంచి సక్సెస్ లు రావడంతో ఈ యంగ్ హీరోను అంతా భవిష్యత్త్ స్టార్ అంటూ పొగిడేశారు. కానీ ప్రస్తుతం నానీ పరిస్థితి రివర్స్ అయ్యింది. వరుస ఫ్లాప్ ఎదురురయ్యేసరికి స్టార్ గా వెలుగిపోతాడు అనుకున్న నాని కాస్త ఒక్కసారిగా వెనుకపడ్డాడు. దీంతో సక్సెస్ కోసం మారుతి తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.
మరోవైపు మారుతి పరిస్థితి ఇంకోలా వుంది. ఈ రోజుల్లో, బస్టాప్ చిత్రాలతో హిట్ కొట్టిన మారుతిని అందరూ అడల్ట్ డైరెక్టర్ పిలవడం మొదలుపెట్టారు. దీంతో సరైన సినిమా చేద్దామంటే చాలా తలకాయనొప్పులు వచ్చి పడుతున్నాయి. టైం అంతగా బాగున్నట్లు లేదు. వెంకటేష్ తో రాధ అనకుంటే అది జరగలేదు. తరువాత మాంచి కథ తీసుకుని సునీల్ తో చేద్దామనుకుంటే, ఆయన ఇన్ వాల్వ్ మెంట్ భరించలేకపోయారు. ఆఖరికి నానితో ఫైనల్ అయింది. కానీ మళ్లీ దర్శకుడిగా వెలగాలంటే మాత్రం ఓ మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిందే. అందుకే ఈ యంగ్ డైరెక్టర్ మంచి టాలెంట్ ఉన్న నానితో సినిమా చేయడానికి సిద్దమయ్యాడు.