English | Telugu

బాలయ్య వందో సినిమాలో చేస్తున్న మోక్షజ్ఞ..!

నందమూరి బాలకృష్ణ వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణిలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా చేరాడు. ఏ పాత్ర లో నటిస్తున్నాడో అని డౌట్ వచ్చిందా..సినిమా తెరపైన కాదులెండి. సినిమాకు తెరవెనుక అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయబోతున్నాడు నందమూరి వారసుడు. సినిమాల్లో నటించపచేయడానికి మోక్షుకు ఇంకా కాస్త వయసు రావాలని బాలయ్య అనుకుంటున్నారు. అందుకే నటనకు దూరం పెట్టారు. అయితే ప్రస్తుతానికి మాత్రం, మోక్షుకు సినిమాలపై టెక్నికల్ గ్రిప్ ఉండాలని ఆయన భావిస్తున్నారట. అందుకే తన కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ గా తెరకెక్కుతున్న శాతకర్ణి సినిమాకు, మోక్షును అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టించారట. ఇలాంటి ఒక భారీ ప్రాజెక్ట్ లో భాగంగా మారితే, మోక్షు కెరీర్ కు కూడా చాలా హెల్ప్ అవుతుందని ఆయన అభిప్రాయం. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో మోక్షు ఎక్కువగా వర్క్ చేస్తాడని సమాచారం. టీం వర్క్, సినిమాలకు సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ లాంటివి మోక్షజ్ఞకు శాతకర్ణితో కాస్త అలవాటు చేయాలనేది బాలయ్య ప్లాన్. చాలా కాలంగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు ఇది శుభవార్తే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.