English | Telugu
చరిత్ర తవ్వుతున్న బాలయ్య..!
Updated : Apr 25, 2016
తన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నటసింహ నందమూరి బాలకృష్ణ. తెలుగు జాతి చరిత్రలో గుర్తుండిపోయేలా తన సినిమాను తెరకెక్కించడానికి బాలయ్య శ్రమపడుతున్నారు. చారిత్రక చిత్రం కావడం..క్రీశ ఒకటవ శతాబ్ధానికి సంబంధించిన చరిత్రను తవ్వుతున్నారు. ఈ మూవీ కోసం పరిశోధన, సమాచార సేకరణలో భాగంగా ఇటీవల బాలకృష్ణ, క్రిష్ కొంతమంది బౌద్ధగురువులతో చర్చించినట్టు సమాచారం. వారిని స్వయంగా తన ఇంటికి పిలిపించుకుని, దాదాపు 12 గంటల పాటు చర్చలు జరిపారట. గౌతమీపుత్ర శాతకర్ణి బౌద్ధాన్ని ఆదరించడం వల్ల వారి గ్రంథాల్లో ఆయన గురించి ప్రస్తావన ఉండవచ్చని బాలయ్య భావించారు అందుకే బౌద్ద గురువులను కలిశారు.