English | Telugu

తమన్నా చాలా హాట్ అంటున్న నాగార్జున

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అంటే ఇష్టం లేని హీరోయిన్లు వుంటారా? అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే మన్మథుడిని ఇష్టపడని వారు ఎవరూ వుండరు. ఇక మహిళా ప్రేక్షకులకైతే ఆయన అంటే ఎంత ఇష్టమో కొత్తగా చెప్పక్కర్లేదు. నాగార్జున వయసు పెరుగుతున్నా ఇప్పటికి ఆయన అందం, స్టైల్ లో యువ హీరోలతో పోటీ పడుతున్నారు. చాలా మంది యంగ్ హీరోయిన్స్ ఆయనతో ఒక్కసారి నటించే అవకాశం రావాలని కోరుకుంటూ వుంటారు. మరి ఇంత మంది హీరోయిన్లు నాగార్జునను ఇష్ట పడుతుంటే...నాగార్జున ఏ హీరోయిన్‌ను ఇష్ట పడుతున్నారు? తెలుసుకోవాలని అందరికి వుంటుంది.


ఇటీవల ఓ షో లో నాగార్జున కూడా ఇదే ప్రశ్న అడిగారు. ఈ తరం హీరోయిన్లు సమంత, కాజల్, శ్రుతి హాసన్, తమన్నాలలో ఎవరంటే ఇష్టం అని అడగగా, 'అందరూ హాటే, అయితే తమన్నా హాటెస్ట్'అని సమాధానం ఇచ్చారు. దీంతో తమన్నా చాలా లక్కీ అని అందరూ ఫీల్ అవుతున్నారట. ఎందుకంటే తన తోటీ నటీమణులను పక్కకు నెట్టి నాగ్తో హాట్ అనిపించుకుంది మన మిల్కీ బ్యూటీ.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.