English | Telugu

నాగార్జునపై క్రిమినల్‌ కేసు.... ఇది కక్ష సాధింపు చర్యేనా?

ఈమధ్యకాలంలో పలు వివాదాలతో సతమతమవుతున్న అక్కినేని నాగార్జునకు ఇప్పుడు మరో కొత్త సమస్య ఎదురైంది. జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి మాధాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నాగార్జునపై ఫిర్యాదు చేశారు. తమ్మిడికుంట చెరువును కబ్జా చేసి అక్రమంగా ఎన్‌ కన్వెన్షన్‌ను నిర్మించినట్టు రెవిన్యూ అధికారులు కూడా నిర్ధారించారని భాస్కరరెడ్డి అంటున్నారు. ఎన్‌ కన్వెన్షన్‌ ద్వారా కోట్ల రూపాయలు వ్యాపారం చేశారని ఆయన ఆరోపించారు. ప్రజలకు అసౌకర్యం కలిగించారు, పర్యావరణాన్ని విధ్వంసం చేశారు, ఇరిగేషన్‌ చట్టాలను ఉల్లంఘించారు వంటి విషయాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. నాగార్జునపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని భాస్కరరెడ్డి కోరారు. అంతేకాదు, చెరువును పునరుద్ధరించడానికి అయ్యే ఖర్చును కూడా నాగార్జున నుంచే వసూలు చేయాలని కోరారు. అయితే లీగల్‌ ఒపీనియన్‌ తీసుకున్న తర్వాత ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని మాధాపూర్‌ పోలీసులు తెలియజేస్తున్నారు.

దాదాపు నెలరోజుల క్రితం తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టిఎల్‌లో ఎన్‌ కన్వెన్షన్‌ నిర్మించారంటూ హైడ్రాకు ఫిర్యాదు చేసింది కూడా భాస్కరరెడ్డే. తాజాగా ఆయన చేసిన ఫిర్యాదులో పర్యావరణానికి ఆటంకం కలిగించారని, ప్రజల్ని ఇబ్బందులకు గురిచేశారని, అందుకే ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని కోరారు. ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేసిన నెల రోజుల తర్వాత మళ్లీ కసిరెడ్డి భాస్కరరెడ్డి తెరపైకి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల అక్కినేని నాగార్జున కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై సీరియస్‌ అయిన నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. ఆమెపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే న్యాయమూర్తి సెలవులో ఉన్న కారణంగా ఈ కేసు విచారణను సోమవారానికి వాయిదా వేశారు. ఈలోగా భాస్కరరెడ్డి మాధాపూర్‌లో నాగార్జునపై ఫిర్యాదు చేయడం వెనుక రాజకీయ హస్తం ఉందా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.