English | Telugu

నాగార్జునకి డిసెంబర్ వర్క్ అవుట్ అవుతుందా..?



మనం చిత్రంతో కథల ఎంపికలో తన పంథాను నాగార్జున మార్చుకున్న సంగతి తెలిసిందే. వైవిధ్యంతో కూడిన కథాంశాలకే ప్రాధాన్యతనివ్వాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా.. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున తాత, మనవడు పాత్రల్లో డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. ఈ రెండు పాత్రలకు రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి (‘అందాల రాక్షసి' ఫేం) కథానాయికలుగా నటిస్తున్నారు.

నాగార్జున సరసన అనసూయ మరదలి పాత్రలో నటిస్తోంది. సినిమాలో నాగార్జున, అనసూయల మధ్య బావా మరదళ్ల సరసాలు, రొమాంటిక్ సీన్లు ఉంటాయని టాక్. నాగార్జునతో కలిసి ఓ పాటలో ఆమె డాన్స్ కూడా చేస్తుందట. హాట్ అండ్ సెక్సీ లేడీ, ఐటం గర్ల్ హంసా నందిని కీలక పాత్రలో కనిపించనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి నాగార్జున మరియు అతని ప్రొడక్షన్ టీం ప్లాన్ చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ చిత్ర టీం డిసెంబర్ లో సరైన రిలీజ్ డేట్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. నాగార్జున కెరీర్లో చాలా హిట్ సినిమాలు అదే నెలలో వచ్చి సూపర్ హిట్స్ గా నిలిచాయి. కావున ఈ సెంటిమెంట్ కూడా నాగార్జునకి పర్ఫెక్ట్ గా వర్క్ అవుట్ అవుతుందని నాగార్జున భావిస్తున్నాడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.