English | Telugu

వేదాంతం వినిపిస్తానంటున్న కుర్రహీరో..!

టాలీవుడ్ కుర్రహీరోల బ్యాచ్ చాలా స్పీడుగా ఉన్నారు. వరస సినిమాలు సైన్ చేస్తూ మాంచి దూకుడు మీదున్నారు. యంగ్ హీరో నాగ శౌర్య కూడా ఈ లిస్ట్ లో ఉంటాడు. మొన్ననే నందినీ రెడ్డితో కళ్యాణవైభోగమే రిలీజ్ చేసి హిట్ కొట్టిన శౌర్య, నీహారికతో ఒక మనసును కూడా పూర్తి చేసేశాడు. అదే ఊపులో ఇప్పుడు థ్రిల్లర్ జానర్ లో సినిమాను ఎంచుకున్నాడు. ఈ సినిమాకు హుస్సేన్ షా కిరణ్ అనే కొత్త దర్శకుడు పనిచేయబోతున్నాడు. హుస్సేన్ మీకు మీరే మాకు మేమే అనే సినిమాను తీశాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాకు కథ అందించి ఫ్యామస్ అయ్యాడు. లేటెస్ట్ గా మరో విభిన్నమైన కథతో, నాగశౌర్య సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నాగశౌర్య పాత్ర, లుక్స్ చాలా వైవిధ్యంగా ఉంటాయని చెబుతున్నాడు దర్శకుడు. సినిమా వేదాంతం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.