English | Telugu

క‌లెక్ష‌న్ కింగ్ పుస్త‌కం రాస్తున్నారా?

మోహ‌న్‌బాబు అంటేనే సంచ‌ల‌నాల‌కు మారు పేరు. క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలో ఆయ‌న త‌రావే ఎవ‌రైనా! ఎన్టీఆర్ త‌ర‌వాత అంత గొప్ప‌గా డైలాగులు చెప్పేదెవ‌రంటే నిస్సందేహాంగా మోహ‌న్‌బాబు అనొచ్చు. వెండి తెర‌పైనా, నిజ జీవితంలోనూ ఆయ‌న ప్ర‌కంప‌నాలు సృష్టించారు. ఇప్పుడు మ‌రో సంచ‌ల‌నానికి తెర లెపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆయన త్వ‌ర‌లోనే త‌న జీవిత కథ రాసుకోబోతున్నట్టు స‌మాచారం. న‌ల‌భై ఏళ్ల సినీ జీవితంలో త‌న‌కు ఎదురైన సంఘ‌ట‌న‌లు, ఎక్కి వ‌చ్చిన మెట్లు, సాధించిన విజ‌యాలు... వీటిన్నింటికీ అక్ష‌ర రూపం ఇవ్వ‌బోతున్నార‌ట‌. అంతేకాదు సినీ ప‌రిశ్ర‌మ‌లోని కుట్ర‌లు, కుతంత్ర‌లు, పెద్ద మ‌నుషుల భాగోతాలూ... ఇవ‌న్నీ అక్ష‌ర బ‌ద్దం చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే యేడాది త‌న పుట్టిన రోజుకి ఈ పుస్త‌కాన్ని విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ఈ పుస్త‌కానికి సంబంధించిన ప్రాజెక్టు.. మంచు విష్ణు చేప‌ట్ట‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. వేదిక‌పై, ఎలాంటి మోహ‌మాటం లేకుండా, ఎదుటివారిపై సెటైర్లు వేసే క‌లెక్ష‌న్ కింగ్‌... అక్ష‌రాలతో ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.