English | Telugu

మెగా, నందమూరి ఫ్యాన్స్ ఫ్లెక్సీ వార్

అభిమానుల వెర్రితనం బాగా ముదురుతోంది. ఇక్కడ వాళ్ళకి తెలియని నిజం ఒకటుంది. మెగాస్టార్ కుటుంబం, నందమూరి కుటుంబం ఇక్కడ చాలా చక్కగా కలసి మెలిసి ఉంటారు. కానీ వీరి అభిమానులు మాత్రం అక్కడ కొట్టుకుంటూ ఉంటారు. వీరి అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఇటీవల మెగా, నందమూరి అభిమానుల మధ్య కోల్డ్ వార్ రోజు రోజుకు మరీ ఎక్కువవుతోంది. మొన్న కోదాడలో పవన్ అభిమానులు ‘తాతల నాటి చరిత్ర చెప్పుకునే అలవాటు మాది కాదు, మేము సృష్టించే చరిత్రే భావితరాలకు భగవద్గీత’ అంటూ ఏర్పాటు చేసిన వివాదం ఇంకా మరుగున పడలేదు విజయవాడలో మరో రెండు ప్లెక్సీలు వెలిశాయి.

"మా స్పీడుకి ఇండస్ట్రీలో బ్రేక్ వెయ్యిలేకపోయారు..క్షణానికో రంగు మార్చే మీ దూకుడెంతరా" అంటూ ఈ రోజు ఉదయం ప్లెక్సీ వెలుగు చూసిన విషయం విధితమే. ఇదిలా ఉంటే తాజాగా మరో ప్లెక్సీ వెలుగులోకి వచ్చింది. అదిలాగుంది. "తాతకు తెలుసు ఖైదీ దెబ్బ..బాబాయ్ కి తెలుసు ఇంద్ర దెబ్బ..బుడ్డోడికి తెలుసు మగధీర దెబ్బ..ఇప్పడు టోటల్ ఫ్యామిలీ రుచి చూస్తారు పంజా దెబ్బ..." అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్లెక్సీ ఏర్పాటు చేశారు.

అయితే ఈ ప్లెక్సీ పై నందమూరి అభిమానులు ఆగ్రమం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ జమానాకు చిరంజీవి తన ఖైదీ సినిమా ద్వారా బ్రేక్ వేశాడని, బాలయ్య ఇంద్ర సినిమా దెబ్బకి, జూనియర్ ఎన్టీఆర్ మగధీర దెబ్బకి కోలుకోలేక పోయారని పరోక్షంగా మా హీరోలను అవమానించే విధంగా ఉందని నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్లెక్సీ వివాదాస్పదంగా ఉండటంతో పోలీసులు దాన్ని తొలగించి, అది ఏర్పాటు చేసిన వారిని అరెస్టు చేశారు. అయితే పవన్ అభిమానుల వాదన మరోలా ఉంది. వారి అభిమానులు ప్లెక్సీలు కట్టుకుంటే తప్పులేదుకానీ..మేము కడితే అరెస్టు చేస్తారా? అంటూ మండి పడుతున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.