English | Telugu

చిరంజీవి లేకుండానే 'మెగా 156' షూట్ స్టార్ట్!

మెగాస్టార్ చిరంజీవి తన 156వ సినిమాని 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంట‌సీ ఫిల్మ్ దసరా రోజున పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.

'మెగా 156' మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 23 నుంచి మొదలు కానుందని తెలుస్తోంది. అయితే చిరంజీవి మాత్రం కాస్త ఆలస్యంగా షూట్ లో జాయిన్ అవ్వనున్నారట. కొద్దిరోజుల పాటు మెగాస్టార్ లేని ఇతర నటుల సన్నివేశాలను చిత్రీకరిస్తారట. డిసెంబర్ లో చిరు షూట్ లో జాయిన్ కానున్నారని సమాచారం.

ఇక ఈ సినిమాకి 'విశ్వంభర' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు టాక్. రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందనున్నఈ చిత్రంలో రానా దగ్గుబాటి విలన్ గా నటించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని ప్రచారం జరుగుతోంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.