English | Telugu

మెకానిక్ రాఖీ ఓటిటి వేదిక కన్ఫార్మ్

విశ్వక్ సేన్(Vishwak Sen)హీరోగా మీనాక్షి చౌదరి(meenakshi chowdary)శ్రద్దా శ్రీనాథ్(shraddha srinath)హీరోయిన్లుగా నటించిన 'మెకానిక్ రాకీ(mechanic rocky)మూవీ ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజయ్యింది.రవితేజ ముళ్ళపూడి(ravi teja mullapudi)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని ఎస్ఆర్ టి కంబైన్స్ పతాకంపై రామ్ తాళ్లూరి(ram talluri)నిర్మించగా నరేష్, సునీల్,హర్ష వర్ధన్, హైపర్ ఆది వంటి వారు ప్రధాన పాత్రలని పోషించారు.

ఇపుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ హక్కులని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు పొందటం జరిగింది. ఈ విషయాన్నీ మూవీ ప్రారంభంలో వచ్చే టైటిల్స్ ద్వారా అధికారకంగా వెల్లడి చేసారుఇక రిలీజ్ కి ఒక రోజు ముందు ప్రీమియర్ షోస్ వెయ్యగా విశ్వక్ సేన్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున వీక్షించడం జరిగింది.చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజొయ్ సంగీతాన్ని అందించాడు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.