English | Telugu

మణి రత్నం సినిమాలో ప్రిన్స్ బదులు రామ్ చరణ్

మణి రత్నం సినిమాలో ప్రిన్స్ బదులు రామ్ చరణ్ తేజ నటించనున్నాడట. వివరాల్లోకి వెళితే తమిళనాడులో బహుళ ప్రాచుర్యాన్ని పొందిన చారిత్రాత్మక తమిళ "పొన్నియన్ సెల్వన్" అనే నవలను చలన చిత్రంగా మలచటానికి ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా వంద కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మించబోయే ఈ సినిమాలో హీరోగా ప్రిన్స్ మహేష్ బాబుని తీసుకోవాలనుకున్నాడు. కానీ ఫైనాన్సియర్లు ఎవరూ ముందుకు రాకపోవటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు మణిరత్నం.

ఇటీవల "మగధీర" సినిమాని తమిళంలోకి "మా వీరన్" పేరుతో అనువదిస్తున్న విషయం తెలిసి, ఆ సినిమాలో రామ్ చరణ్ నటనకు ముగ్ధుడై, ప్రిన్స్ మహేష్ బాబుకు బదులు రామ్ చరణ్ ని హీరోగా తీసుకోవాలని అనుకుంటున్నాడట మణిరత్నం. మరి రామ్ చరణ్ హీరో అయితే మాత్రం వందకోట్లకు ప్యాగా ఖర్చయ్యే ఈ సినిమాకు ఫైనాన్సియర్లు దొరుకుతారా అన్నది అనుమానమే. అయినా రామ్ చరణ్ ఈ సినిమాలో నటించటానికి అంగీకరిస్తాడో లేదో కాలమే చెప్పాలి. మహేష్ బాబుకే రాని ఫైనాన్సియర్లు రామ్ చరణ్ కి వస్తారంటారా...? ఏమో....! అనుమానమే....!

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.