English | Telugu

నా తల్లి హాస్పిటల్ లో లేదని చెప్తున్న మనోజ్

మంచు మనోజ్(manoj)మోహన్ బాబు(mohan babu)మధ్య రెండు రోజులుగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ విషయంలో పోలీసులు కూడా జోక్యం చేసుకోవడంతో ఏ నిమిషం ఏం జరుగుతుందనే ఆసక్తి ఇప్పుడు అందరిలో ఉంది. రీసెంట్ గా ఈ విషయం మీద విష్ణు(vishnu)కూడా మాట్లాడుతూ తన ఆవేదనని వ్యక్తం చెయ్యడంతో పాటు తన తండ్రి మోహన్ బాబు తో పాటు తల్లి కూడా హాస్పిటల్ లో ఉందని చెప్పాడు. మోహన్ బాబు కూడా నిన్న రిలీజ్ చేసిన ఆడియోలో తన భార్య హాస్పిటల్ లో ఉందని చెప్పడం జరిగింది.

కానీ ఇప్పుడు మనోజ్ మాట్లాడుతు నా తల్లి హాస్పిటల్ లో ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఆమె ఇంట్లోనే ఉన్నారు.కూర్చుని మాట్లాడుకోవడానికి నేను సిద్ధమని చెప్పడం జరిగింది.అదే టైం లో రాచకొండ సీపీకి లక్ష రూపాయిల బాండ్ సమర్పించిన మనోజ్‌ తనంతట తాను గొడవలకు దిగనని..శాంతి భద్రతలకు విఘాతం కల్గించనని బాండ్ లో పేర్కొనడం జరిగింది.ఇక ఈ కేసులో మోహన్ బాబు, విష్ణు ల లైసెన్స్ డ్ రివాల్వర్లు ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది.


అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.