English | Telugu

చిన్న సినిమాల మీద మంచు లక్ష్మికి లవ్వు

చిన్న చిన్న సినిమాలు తీసేవారికి కాస్తంత ఇమేజ్ వున్న తారలు దొరకరు. ఎవరో అందుబాటులో వున్నవాళ్ళతో సినిమాలు చుట్టేస్తూ వుంటారు. ‘తారాబలం’ లేకపోవడం, కనీసం జనానికి తెలిసిన ముఖాలు కూడా లేకపోవడం వల్ల ఆ సినిమాలు వ్యాపారపరంగా ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొంటూ వుంటాయి. ఒకవేళ అష్టకష్టాలు పడి చిన్న సినిమాలను విడుదల చేసినా ఎవర్ని చూసి సినిమా హాల్‌కి వెళ్ళాలన్న సందేహం ప్రేక్షకులకు వస్తూ వుంటుంది. అందువల్ల సినిమా రంగంలో వున్న సెలబ్రిటీలు పెద్ద సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వకుండా చిన్న సినిమాలను కూడా ఓ కంట కనిపెట్టి వుండాల్సిన బాధ్యత వుందని సినీ రంగంలోని పెద్దలు అంటూ వుంటారు. ఇప్పుడు అలా బాధ్యతగా వ్యవహరించే వారిలో మోహన్ బాబు తనయ మంచు లక్ష్మి కూడా చేరారు. మంచు లక్ష్మి ఇటీవలి కాలంలో అనేక చిన్న సినిమాలలో నటించడానికి అంగీకరించారు. మొన్నామధ్య విడుదలైన ‘చందమామ కథలు’ సినిమాలో నటించిన మంచు లక్ష్మి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో వున్న ‘బుడుగు’ అనే సినిమాలో కీలక పాత్రను ధరించారు. అలాగే మొన్నీమధ్యే షూటింగ్ ప్రారంభించుకున్న ‘పిలవని పేరంటం’ అనే సినిమాలో కూడా మంచు లక్ష్మి నటించేందుకు అంగీకరించారు. అలాగే ఆమె ఇంకా అనేక చిన్న సినిమాలలో నటించడానికి అంగీకరించినట్టు సమాచారం.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.