English | Telugu

ఇప్పుడు 'మిన‌ప‌ట్టు' వేస్తాడ‌ట‌!

ఓర్నాయ‌నో.. 'పెస‌రెట్టు' మాడి మ‌సై.. బూడిద‌య్యింది. ఏదో టైటిల్ బాగుంది క‌దా అని థియేట‌ర్‌కి వెళ్లి మాడు మొహాలేసుకొచ్చారు ఆడియ‌న్స్‌. మ‌హేష్‌క‌త్తి.. క‌త్తిలా తీస్తాడ‌నుకొన్న‌వాళ్లు ఆ సుత్తి భ‌రించ‌లేక పారిపోయారు. అయినా మ‌హేష్ క‌త్తికి త‌న టాలెంట్‌పై న‌మ్మ‌కం పోలేదు. పెస‌రెట్టు పోతే పోయింది.. దానికి సీక్వెల్‌గా 'మిన‌ప‌ట్టు' తీస్తా అంటున్నాడ‌ట‌. ఇది పెస‌రెట్టుకు సీక్వెల్‌! 'నా సినిమా న‌చ్చ‌క‌పోతే మ‌రోటి తీస్తా.. అదీ న‌చ్చ‌క‌పోతే ఇంకోటి తీస్తా' అని ఎన్టీఆర్ అన్న‌ట్టు టేస్టు న‌చ్చేంత వ‌ర‌కూ ఇలాంటి అట్లు వేస్తూనే ఉంటాడేమో ఈయ‌న‌. మిన‌ప‌ట్టూ మాడిపోతే బొబ్బ‌ట్లు.. అదీ న‌చ్చ‌క‌పోతే దిబ్బ‌రొట్టూ తీస్తాడేమో..???? అన్న‌ట్టు ఈ సినిమా కూడా క్రౌడ్ ఫండిగ్ ద్వారానే చేస్తాడ‌ట‌. మ‌రి ఈయ‌న‌పై న‌మ్మ‌కం ఉంచి, డ‌బ్బులు ఇచ్చే మ‌హానుభావులెవ‌రో..???

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.